TELANGANA: కేసీఅర్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయనలో గొప్ప పాఠకుడు ఉన్నారు, ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. అలాగే మంచి సాహితీ సృజన తపన కూడా ఉందని నిరూపించుకున్నారు. ఆయన భాషలో క్లాస్ అండ్ మాస్ రెండూ ఉంటాయి. ఎప్పటికి ఏది అవసరంలో దానికి తగినట్లుగా ఆయన తన భాషా చాతుర్యాన్ని ఉపగిస్తారు అని అంటారు. తాజాగా చూస్తే దసరా పండుగ వేళ కేసీఅర్ వేసిన ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతోంది. అందులో ఎన్నో అర్ధాలు కనిపిస్తున్నాయి.
ఏనాటికైనా ధర్మానిదే విజయం :
ఏ రోజుకు అయినా ధర్మానిదే విజయం అని ఆ స్ఫూర్తిని దసరా అందిస్తోందని కేసీఆర్ ట్వీట్ చేశారు. ఆయన తెలంగాణా రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఈ మేరకు శుభాకాంక్షలు చెబుతూ ఈ ట్వీట్ చేశారు. ఇక పూర్తిగా చదివితే ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి అని కూడా కేసీఆర్ ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతో పాటు దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు. ఇలా దసరా పండుగను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినా లోపల అర్ధం చాలానే ఉంది అని అంటున్నారు.
బీఆర్ఎస్ దేనా :
తొందరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు తెలంగాణాలో జరుగుతున్నాయి. అంతే కాదు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా ఉంది. అదే విధంగా 2028లో అసలైన ఎన్నికలు ఉనాయి. తెలంగాణాలో కాంగ్రెస్ పాలనకు రెండేళ్ళు పూర్తి అవుతున్నాయి. జనంలో వ్యతిరేకత అధికారం పార్టీ మీద ఉందని బలంగా గులాబీ పార్టీ నమ్ముతోంది. ఆ యాంటీ ఇంకెంబెన్సీ అంతా తమకే సొమ్ముగా మారుతుందని తాము గెలిచి నిలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేస్తోంది.
సరైన సమయంలోనే :
ఇక బీఆర్ఎస్ కి సంబంధించి ఇద్దరు కీలక నేతలు పార్టీని దూకుడుగా తీసుకుని వెళ్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరూ జోడు గుర్రాల మాదిరిగా పార్టీని జనం ముందు ఉంచుతున్నారు. అయితే కేసీఆర్ ఎపుడు జనంలోకి వస్తారు అంటే సరైన సమయంలోనే అని కేటీఅర్ ఆ మధ్య చెప్పారు. మరి ఆ టైం ముహూర్తం ఏమిటో గులాబీ బాస్ కే తెలియాలి. కానీ ఇంతలో ఆయన దసరా వేళ ఒకే ఒక ట్వీట్ చేసి రాజకీయంగా మెరుపులే మెరిపించారు.
గులాబీ రాజ్యమేనట :
ఏనాటికి అయినా ధర్మమే విజయం సాధిస్తుంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ చర్చకు నోచుకుంటున్నాయి. కాంగ్రెస్ గద్దె దిగుతుందని అదే సమయంలో గులాబీ రాజ్యం వస్తుందని ఆయన ధీమాగా చెప్పారన్న మాట. పెద్ద పండుగ వేళ ఆయన ఈ రకమైన ట్వీట్ తో గులాబీ దండుకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని అందించారు అన్న మాట. కాంగ్రెస్ సర్కార్ ఓటమి ఇక ఖాయమని స్థానిక సంస్థల ఎన్నికలతోనే అది మొదలవుతుందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు గట్టిగా చెబుతున్న నేపధ్యంలో కేసీఅర్ ట్వీట్ తో మరింత మసాలా దట్టించారు అని అంటున్నారు.
బీఆర్ఎస్ ఎక్కడా వాడిపోలేదు, ఓడిపోలేదని ముందున్నది గులాబీ బాటే అంటూ అపర చాణక్యుడు కేసీఅర్ ఇచ్చిన ఈ ఒక్క ట్వీట్ చాలు క్యాడర్ దూసుకుని పోవడానికి అని అంటున్నారు. కరెక్ట్ టైంలో బిగ్ సౌండ్ చేయడం అంటే ఇదే అని అంటున్నారు.
✳️ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు!
— BRS Party (@BRSparty) October 1, 2025
✳️ ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి
- బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
♦️ తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతో పాటు, దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా.. విజయ… pic.twitter.com/loyyJWS6WV
