WORLD NEWS: భారత్ లో ఔషధాల విక్రయాన్ని పరిశీలిస్తే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ ధరలో అయితే.. రెండోది జనరిక్ పేరిట ఉంటుంది. ఈ విధానంతో కాస్ట్లీ మెడిసిన్ కూడా తక్కువ రేటుకు వస్తుంది. ఇది భారత్ లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ విధానినికే అమెరికా మొగ్గు చూపిస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రిస్క్రిప్షన్ ఔషధాల ధరలను తగ్గించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ దేశా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట (TrumpRx.gov) అనే వెబ్‌సైట్ ప్రారంభించడం ద్వారా అమెరికా ప్రజలకు చౌక ఔషధాలు వచ్చి చేరుతున్నాయి. ఫైజర్ వంటి ప్రధాన బయోటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని, ఈ వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు ప్రిస్క్రిప్షన్ ఔషధాలను 50 శాతం తక్కువ ధరకు పొందుతున్నారు.
ఆరోగ్య ఖర్చులు తగ్గింపే లక్ష్యం
అమెరికాలో వైద్యానికి ఖర్చు పెరుగుతుంది. ప్రభుత్వం ఈ రంగంపై ఆర్థిక భారం తగ్గించడానికి చర్యలు తీసుకుంది. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ విధానం ద్వారా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, స్విట్జర్లాండ్, డెన్మార్క్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని ఔషధాల ధరలతో అమెరికా ధరలను సమం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. దీని ఫలితంగా, అమెరికా ప్రజలకు అవసరమైన మందులు మరింత చౌకగా అందుతాయి.
ఫైజర్‌తో ప్రత్యేక ఒప్పందం..
TrumpRx.gov వెబ్‌సైట్ ద్వారా పంపిణీ చేసే మందులను ఫైజర్ అందజేస్తుంది. ప్రాథమిక ఔషధాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. నేరుగా కొనుగోలు చేసే సందర్భంలో కంటే ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేస్తే 50 శాతం తక్కువ ధరతో ఔషధాలు లభిస్తాయి. అయితే, ఏ మందులు అందుబాటులో ఉంటాయి అన్న విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు వెల్లడించినట్లుగా.. త్వరలో మరిన్ని ఔషధ తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీని వల్ల వినియోగదారులు మరింత విస్తృత పరిధిలో తక్కువ ధరకు ఔషధాలను పొందగలుగుతారు.
TrumpRx.gov సైట్ నేరుగా ఔషధాలు విక్రయించదు. వినియోగదారుల ప్రిస్క్రిప్షన్‌లను డైరెక్ట్-టు-కన్స్యూమర్ ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లిస్తారు, కాబట్టి సైట్ ఆపరేషనల్ రహితంగా ఉంటుందనే విశ్లేషణ.
గ్లోబల్ ఫార్మా రంగంపై ప్రభావాలు..
ఈ విధానం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో మందుల ధరలు తగ్గితే, ఫార్మా కంపెనీలు ఇతర దేశాల్లో లాభాలు పొందేందుకు భారతదేశం వంటి మార్కెట్లలో ధరలు పెంచే ప్రయత్నాలు చేస్తాయి. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ విధానాన్ని అమలు చేస్తే, అమెరికాలో ధరలు తగ్గినా, అంతర్జాతీయ మార్కెట్లలో ధరల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
చౌకగా మందులు..
TrumpRx.gov ప్రాజెక్ట్ తో దేశీయ ప్రజలకు ఔషధాలు చౌకగా అందించడం, ఫార్మా కంపెనీల వ్యాపార వ్యూహాలను మళ్లీ రూపొందించడంలో కీలకంగా ఉంటుంది. కానీ, అంతర్జాతీయంగా ఇతర దేశాల ధరలపై దారితీసే ప్రభావాలను ప్రభుత్వాలు పరిగణించాలి. అమెరికా మార్కెట్ లో తక్కువ ధర కోసం గ్లోబల్ ధరలను మార్చే అవకాశం ఉన్నట్లు, స్థానిక వ్యూహాలను అంచనా వేయాలి.
తగ్గనున్న భారం..
TrumpRx.gov వెబ్‌సైట్ ఒక విధంగా అమెరికా వైద్య వ్యయం తగ్గింపు ఉద్యమం అని అమెరికా చెప్తోంది. ఇది వినియోగదారులకు తక్షణ లాభాలను ఇస్తే, గ్లోబల్ ఫార్మా వ్యాపారాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రయత్నం అంతర్జాతీయంగా ఎలా ప్రతిఫలిస్తుందో, దేశీయ విధానాలు, మార్కెట్ వ్యూహాలపై దీర్ఘకాలిక ప్రభావాలను విశ్లేషించడం అవసరం.
