WORLD NEWS: గాజా యుద్ధం అక్కడి ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. అక్కడి మహిళలు మరింత భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఆహార కొరత, ఉద్యోగ అవకాశాల లేకపోవడం.. సహాయ వనరులపై పెరుగుతున్న పోటీ మహిళలను మరింత కష్టాల్లోకి నెడుతుంది. అయితే, సహాయం మాటున కొందరు పురుషులు మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని అక్కడి వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల కోసం ఆ పని చేసిన మహిళ..
దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు ఓ తల్లి తీవ్రమైన అవమానం లైంగిక దోపిడీని ఎదుర్కొంంది. 38 ఏళ్ల ఒక తల్లి తన అనుభవాన్ని నేషనల్ మీడియా ముందు ఉంచింది. ‘సహాయం కోసం ఎదురు చూసే చోట ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనపై లైంగికదాడి చేశాడు. ఖాళీ అపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లి నాపై లైంగికదాడి చేశాడు. నా పిల్లల ఆకలి తీర్చేందుకు ఇది తప్పలేదు. ఈ సందర్భం గాజాలోని సహాయ కేంద్రాల్లో మహిళలపై జరిగే దుర్వినియోగానికి ఉదాహరణ. .
హ్యూమన్ రైట్స్ ఏమంటుందంటే..?
హ్యూమన్ రైట్స్ వాచ్ సూచిస్తున్నట్లు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో లైంగిక దోపిడీ సర్వసాధారణ సమస్య. గాజాలో మహిళలు, బాలికలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాయం కోసం చూస్తున్న మహిళల్లో కొందరు గర్భవతులయ్యారని, వారికి మానసిక చికిత్స అవసరమయ్యిందని కొందరు సైనియార్టిస్టులు వెల్లడించారు.
అర్థరాత్రి ఫోన్ చేస్తున్నారు..
ఇంకా, 29 నుంచి 35 ఏళ్ల వయస్సున్న మహిళలు, సహాయ వర్గాల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. సహాయం చేస్తామని చెప్పి వస్తున్న వ్యక్తులు ఫోన్ నెంబర్లు ఇచ్చి, అర్థరాత్రి ఫోన్ చేయడం, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం వంటి సందర్భాలున్నాయి. గతేడాది గాజాలో 18 లైంగిక వేధింపుల కేసులు అధికారికంగా నమోదైనట్లు పీఎస్ఈఏ నెట్వర్క్ తెలిపింది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం..
ఈ పరిస్థితులు గాజాలోని మహిళల భద్రత, వారి మానసిక ఆరోగ్యం వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాయం పొందే సమయాల్లో కూడా వారి రక్షణకు సమాజం.. అంతర్జాతీయ సంఘాలు, ప్రభుత్వాలు కృషి చేయాలి. యుద్ధం, ఆహార కొరత, లైంగిక దోపిడీ మానవతా విలువలను ఎలా నాశనం చేస్తాయో తెలియజేస్తుంది. సమాజం, ప్రభుత్వాలు, సహాయ సంస్థలు ఈ సమస్యను పక్కన పెట్టకుండా, మహిళల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.
